కర్ణాటకలోని మంగళూరులో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. నగేశ్ అనే వ్యక్తి.. భార్య, పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 8న వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ నలుగురు మృతికి కారణం మతమార్పిడికి బలవంతం చేయడమే అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ విషయాన్ని నగేశ్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నట్టు వెల్లడించారు. మతమార్పిడికి బలవంతం చేసిన నూర్ జహాన్ అనే మహిళను అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
బంగల్కోట్ జిల్లాకు చెందిన నగేశ్ షేరిగుప్పి విజయలక్ష్మి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరు కొంతకాలం మ్యారేజ్ బ్రోకర్‌గా పనిచేసే నిందితురాలు నూర్జహాన్ అపార్టెమెంట్లో నివసించేవారు. ఆ తర్వాత మోర్గాన్ గేట్‌లోని నివాసానికి మారారు. అయితే నగేశ్ భార్య విజయలక్ష్మి ఆమెను కలుస్తూ ఉండేది. ఈ విషయంపైనే భార్య భర్తలకు గొడవైంది. కొద్ది రోజులు నూర్ జహాన్ ఇంట్లోనే ఉంది. 'నగేశ్‌కు విడాకులు ఇచ్చి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోమని నూర్ జహాన్ నా భార్యను బలవంతం చేసేది. నా భార్య మతం మారుతోందని తెలిసే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని నగేశ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
ఆహారంలో విషం కలిపి భార్య, పిల్లలను చంపేసి.. ఆనంతరం నగేస్ ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి :డీజే పాటలకు నృత్యం చేస్తూ రైతుల సంబరాలు