తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బొగ్గు దొంగల ముఠా, జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి - ఝార్ఖండ్ ఎన్​కౌంటర్ 4గురి మృతి న్యూస్

ఝార్ఖండ్​లో బొగ్గు దొంగల ముఠాకు, సీఐఎస్ఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. అసలేం జరిగిందంటే..

4-killed-in-encounter-between-cisf-jawan-and-coal-thieves-in-dhanbad
బుల్లెట్ కాల్పుల్లో పగిలిన వాహనం అద్దాలు

By

Published : Nov 20, 2022, 12:04 PM IST

ఝార్ఖండ్​ ధన్​బాద్ ​జిల్లాలోని బాఘ్మారా డుమ్రాలో సీఐఎస్ఎఫ్ పోలీసులు, బొగ్గు దొంగల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. సీఐఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం.. బొగ్గును దొంగిలించే నెపంతో దొంగల ముఠా డుమ్రాలోని కేకేసీ బీసీసీఎల్ రెండో బ్లాక్ వద్దకు వచ్చారు. బొగ్గును దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. వారిని జవాన్లు హెచ్చరించారు. దీంతో ఇరు వర్గాలకు భీకర పోరు జరిగింది. దొంగలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు సైతం కాల్పులు ప్రారంభించారు.

కాల్పుల్లో ధ్వంసమైన ద్వీచక్ర వాహనాలు
కాల్పుల్లో పగిలిన వాహనం అద్దాలు

ఈ పోరులో నలుగురు బుల్లెట్​ గాయాలతో మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షహీద్ నిర్మల్ మహతో బోధనాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి విషమించటం వల్ల వారిని రాంచీలో హాస్పిటల్​లో చేర్పించారు. అయితే ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఘటనా స్థలాన్ని పోలీసులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు సీజ్ చేశారు.

కాల్పుల్లో పగిలిన వాహనం అద్దాలు
కాల్పుల్లో పగిలిన వాహనం అద్దాలు

ABOUT THE AUTHOR

...view details