Rajasthan accident: రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని చిత్తోర్‌గఢ్-ప్రతాప్‌గఢ్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక ట్రక్కు, కారు, జీపు ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కారులో ప్రయాణిస్తున్న దశరథ్ (25), పరీబాయి (70), నిహాల్ (4), నెల వయసున్న చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా, జీపులో ఉన్న మరో ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, మూడు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.