Accident In Odisha: ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. కంధమాల్ జిల్లా ఫూల్బనీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లహాబడిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి - ఒడిశా'
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
road accident in odisha
ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. బిసిపాడలోని తమ బంధువుల ఇంటిలో శుభకార్యానికి హాజరై గుమ్మగదకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.