drown in river: తమిళనాడు కడలూరులో హృదయవిదారక ఘటన జరిగింది. నెల్లికుప్పం అరుంగుణం సమీపంలోని కెడిలం నదిలో ఏడుగురు మృతిచెందారు. ఓ యువతి, ఆరుగురు బాలికలు కలిసి స్నానానికి నదిలోకి దిగారు. లోతైన ప్రదేశానికి వెళ్లడం వల్ల ఏడుగురు గల్లంతయ్యారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టగా ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు దుర్మరణం - నదిలో గల్లంతైన ఏడుగురు
drown in river: నదిలో మునిగి, ఏడుగురు చనిపోయిన హృదయవిదారక ఘటన తమిళనాడులోని కడలూరులో జరిగింది. స్నానానికి నదిలో దిగిన ఓ యువతి, ఆరుగురు బాలికలు మరణించారు.
drown in river
మృతులను నవనీత(19), సుముత(16), ప్రియ(17), మోనికా(15), సంగీత(17), ప్రియదర్శిని(14), కావ్య(12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఇదీ చదవండి:రూ.50వేలకు ఎముక.. లక్షన్నరకు అస్థికలు.. శ్మశానంలో 'క్షుద్ర' దందా!
Last Updated : Jun 5, 2022, 8:34 PM IST