మహారాష్ట్ర నాగ్‌పుర్ కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మృతిచెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
శుక్రవారం రాత్రి 8.10 గంటలకు వాడి ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి రెండో అంతస్తులో ఉన్న ఐసీయూ గదిలో అగ్నిప్రమాదం తొలుత సంభవించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.