నారదా స్టింగ్ కేసులో అరెస్టైన ఇద్దరు మంత్రులు సహా నలుగురు నేతలను గృహ నిర్బంధం చేయాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో అరెస్టైన మంత్రులు సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీం, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టేను ఎత్తివేయాలన్న అభ్యర్థనను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం తోసిపుచ్చింది. వారికి గృహ నిర్బంధం విధించాలని ఆదేశించింది.
ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలోని న్యాయమూర్తుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నందున వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లుగా న్యాయస్థానం తెలిపింది.