తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో 39 వేల కేసులు- కశ్మీర్​ స్కూళ్లలో కరోనా కలకలం

మహారాష్ట్రలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 39,544 మందికి వైరస్​ సోకింది. మహమ్మారి తీవ్రత ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజు నమోదైన కేసుల్లో రెండోసారి అత్యధికంగా పెరుగుదల కనిపించింది. మరోవైపు జమ్ముకశ్మీర్​లోని 2 పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో 50 మంది విద్యార్థుల్లో వెలుగుచూసింది.

By

Published : Mar 31, 2021, 9:53 PM IST

39,544 new COVID-19 cases in Maha, second biggest one-day rise
మహాలో రెండోసారి భారీగా కరోనా కేసులు

దేశంలో రెండోదశ కరోనా విజృంభిస్తున్న వేళ.. మహారాష్ట్రలో కొత్తగా 39,544 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి ఒక్క రోజులోనే 227 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి బారిన పడిన వారిలో మరో 23,600 మంది కోలుకున్నారు.

  • రాష్ట్రంలో మొత్తం కేసులు - 26,73,461
  • మొత్తం రికవరీలు - 24,00,727
  • మొత్తం మరణాలు - 54,073
  • యాక్టివ్​ కేసులు - 3,56,243

జమ్మూలో 50 మంది విద్యార్థులకు..

జమ్ముకశ్మీర్​లోని రెండు పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో 50 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఒక వారం పాటు ఈ విద్యాసంస్థలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

కుల్గాం జిల్లా దామ్​హాల్ తాలూకాలోని 'నూరాని పబ్లిక్ స్కూల్‌'కు చెందిన 36 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా కరోనా వెలుగుచూసింది. అదేవిధంగా అనంతనాగ్ జిల్లాలోని కాత్సూ ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 14 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

విద్యార్థులు కలిసిన వారిని గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఇంటింటి డ్రైవ్ ప్రారంభిస్తుందని ఈ మేరకు బ్లాక్ మెడికల్ అధికారి షు గుఫ్తా సలాం తెలిపారు.

ఇదీ చదవండి:ఆర్థిక ప్రభావం లేకుండా 'మహా'లో లాక్​డౌన్​!

'మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'

ABOUT THE AUTHOR

...view details