గుజరాత్ సాబర్కాంఠా జిల్లాలో కరోనా కలకలం రేగింది. అక్కడి ఓ వసతి గృహంలో 39 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు ఓ ఆరోగ్య అధికారి వెల్లడించారు. అయితే.. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని చెప్పారు.
సహ్యోగ్ కుష్థా యగ్న ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే హాస్టల్లోని 292 మందికి ఆదివారం పరీక్షలు నిర్వహించగా.. 39 నమూనాలు పాజిటివ్‌గా తేలినట్లు ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు. కొందరు విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లగా.. మిగతా వారిని ఆసుపత్రిలో చేర్పించినట్లు స్పష్టం చేశారు.