మహారాష్ట్ర రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గువాహటికి మరింత మంది ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు శివసేన రెబల్ లీడర్ ఏక్‌నాథ్ శిందే. శివసేన శాసనసభాపక్ష పార్టీ నేతగా గుర్తించాలని కోరారు. తమకు 36 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారు సంతకాలు చేసిన లేఖ కాపీలను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, శాసనమండలి సెక్రెటరీ రాజేంద్ర భగవత్‌లకు పంపించారు.
మరోవైపు.. శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలేను శాసనసభాపక్ష పార్టీ చీఫ్ విప్‌గా సునిల్ ప్రభు స్థానంలో నియమిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు శిందే. ఈ క్రమంలో సునీల్ ప్రభు సమావేశానికి హాజరుకాని రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలి డిమాండ్ చేసిన వారిపై విమర్శలు గుప్పించారు శిందే. విప్ కేవలం శాసనసభ కార్యక్రమాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
అనర్హత వేటుకు శివసేన సిఫార్సు..పార్టీపై తిరుగుబావుట ఎగురవేసిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు శివసేన లేఖ రాసింది. అనర్హత వేటుకు సంబంధించిన మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి