మహారాష్ట్రలోని ముంబయిలో కొవిడ్ పంజా విసురుతోంది. కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 8 నుంచి ఇప్పటివరకు నగరంలో కొత్త కేసుల శాతం 36.38కి పెరిగినట్లు ముంబయి నగరపాలక సంస్థ ప్రకటించింది.
పౌరుల నిర్లక్ష్య వైఖరి, లోకల్ రైళ్లలో ప్రయాణాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడం వంటి వాటి కారణంగా కేసులు సంఖ్య అమాంతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన ముంబయిలో 5,335 రోజు వారీ కేసులు వెలుగు చూడగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 7,276గా ఉన్నట్లు తెలిపింది. కొత్త కేసులు ఫిబ్రవరి 8న అత్యల్పంగా 0.12 శాతం నమోదుకాగా... ప్రస్తుతం వాటి రేటు రెండింతలు అయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
కొత్తగా మహమ్మారి సోకిన వారి సంఖ్య పెరుగుతున్నా.. మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.