దేశంలో వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గురువారం కొత్తగా 35 వేల 952 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఆ రాష్ట్రంలో నమోదైన రోజువారి కేసుల్లో ఇవే అత్యధికం. వైరస్ ధాటికి మరో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో కేసులు
- మొత్తం కేసులు : 26,00,833
- మొత్తం రికవరీలు : 22,83,037
- మొత్తం మరణాలు : 53,795
- యాక్టివ్ కేసులు : 2,62,685
ముంబయిలో కేసులు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గురువారం 5,505 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు : 3,80,115
- మొత్తం రికవరీలు : 3,33,603
- మొత్తం మరణాలు : 11,620
- యాక్టివ్ కేసులు : 33,961
దిల్లీలో కేసులు
దిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 1,515 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. వైరస్‌కు ఐదుగురు బలయ్యారు.
- మొత్తం కేసులు : 6,52,742
- మొత్తం రికవరీలు : 6,36,267
- మొత్తం మరణాలు : 10,978
- యాక్టివ్ కేసులు : 5,497