'ఐదేళ్లలో 326 రాజద్రోహం కేసులు- శిక్ష పడింది ఆరుగురికే!' - రాజద్రోహం చట్టం
ఐదేళ్ల కాలం(2014-19)లో రాజద్రోహ చట్టం కింద దేశంలో 326 కేసులు నమోదయ్యాయని కేంద్రం హోం శాఖ తెలిపింది. అందులో ఆరుగురికి మాత్రమే శిక్ష పడినట్లు పేర్కొంది.
రాజద్రోహం కేసులు
By
Published : Jul 18, 2021, 5:09 PM IST
|
Updated : Jul 18, 2021, 6:19 PM IST
దేశంలో 2014 నుంచి 2019 మధ్య రాజద్రోహ చట్టం కింద 326 కేసులు నమోదయ్యాయి. అందులో ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది.
కేంద్రం నివేదిక ప్రకారం.. అత్యధికంగా అసోంలో 54 కేసులు నమోదయ్యాయి. మొత్తం 326 కేసుల్లో 141 కేసుల్లో అభియోగపత్రం దాఖలైంది. 2020 ఏడాదికి సంబంధించిన సమాచారాన్ని నివేదికలో చేర్చలేదు.
ఐదేళ్లలో ఈవిధంగా కేసులు నమోదయ్యాయి.
సంవత్సరం
మొత్తం కేసులు
శిక్షపడినవి
2014
47
1
2015
30
-
2016
35
1
2017
51
1
2018
70
2
2019
93
1
భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 124ఏ(రాజద్రోహ చట్టం)పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. చట్టం దుర్వినియోగానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటీష్ కాలంనాటి ఈ చట్టాన్ని ఎందుకు తొలగించలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ ఐదేళ్లలో రాజద్రోహం చట్టం కింద ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎన్ని కేసులు నిలబడ్డాయి? అనే వివరాలు సమర్పించాలని ఆదేశించింది.