చైనా ఆన్లైన్ గేమ్స్ సహా అంతర్జాతీయ వెబ్సైట్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్న ఓ హ్యాకర్‌ను బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ హ్యాకర్ వద్ద నుంచి రూ.9 కోట్లు విలువైన 31 బిట్కాయిన్లు సీజ్ చేసినట్లు సీసీబీ పోలీసులు వెల్లడించారు.
ఆన్లైన్ పోకర్ వెబ్సైట్లు సహా, బిట్‌కాయిన్, వైఎఫ్ఐ, ఎథీరియం లాంటి క్రిప్టో కరెన్సీ ఖాతాల హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తమ విచారణలో తెలిసిందని సీసీబీ వెల్లడించింది. ఆ హ్యాకర్ మొత్తం 10 పోకర్ వెబ్సైట్లు, నాలుగు ఇతర వెబ్సైట్లు, 3 బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజీలను హ్యాక్ చేసినట్లు తెలిపింది.