తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ రాష్ట్రంలో అందరికీ కరెంట్ ఫ్రీ!'

ప్రతి కుటుంబానికి ఉచితంగా 300ల యూనిట్ల విద్యుత్తు ఇస్తామని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు ఆప్ అధినేత కేజ్రీవాల్.

300 free electricity units in Punjab
300 free electricity units in Punjab

By

Published : Jun 29, 2021, 2:58 PM IST

Updated : Jun 29, 2021, 3:28 PM IST

పంజాబ్​లో ఆమ్​ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టిన ఆయన​.. విద్యుత్తును ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు.

"పంజాబ్​లో మూడు భారీ కార్యక్రమాలు చేపడతాం. తొలుత, ప్రతి కుటుంబానికి ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్తు అందిస్తాం. రెండు, పెండింగ్​ బిల్లులను రద్దు చేసి విద్యుత్తు కనెక్షన్ పునరుద్ధరిస్తాం. చివరగా, 24 గంటలు విద్యుత్తు​ సరఫరా చేస్తాం."

- అరవింద్ కేజ్రీవాల్, ఆప్​ అధినేత

విద్యుత్​ సంస్థలతో పంజాబ్​ ప్రభుత్వం కుమ్మక్కైందని కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీలో 2013లో తాము అధికారంలోకి వచ్చే ముందు ప్రజలపై విద్యుత్ బిల్లు రూపంలో పెను భారం పడేదని, ప్రస్తుతం చాలా చౌకగా లభిస్తుందని తెలిపారు. అదే పంజాబ్​లోనూ సాకారం చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:పంజాబ్ ఎన్నికల కోసం అకాలీదళ్- బీఎస్పీ పొత్తు

Last Updated : Jun 29, 2021, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details