రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం - heroin has seized in maharashtra mumbai
05:22 July 03
రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర ముంబయిలో 290 కిలోల హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటిలిజెన్స్ డైరెక్టరేట్(ఆర్ఐడీ)అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.300 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
సముద్ర మార్గం ద్వారా విదేశాల నుంచి ముంబయిలోని జేఎన్పీటీ పోర్టుకు మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు.. తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే భారీగా హెరాయిన్ పట్టుబడినట్లు చెప్పారు. అలాగే జేఎన్పీటీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.