తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగుల జీతాల్లో 30% కోత- తల్లిదండ్రులకు బదిలీ - లాతూర్ జిల్లాలో జీతాల కోత

తల్లిదండ్రుల పట్ల అలసత్వం చూపిస్తున్న ఉద్యోగుల జీతంలో కోత విధించింది మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా పరిషత్. సిబ్బంది వేతనంలో 30 శాతాన్ని తల్లిదండ్రుల ఖాతాలకు బదిలీ చేసింది. ఔరంగబాద్ జడ్పీ తొలిసారి ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టింది.

30 percent salary of employees deposited in parents bank account Latur Zilla Parishad
ఉద్యోగుల జీతాల్లో కోత- పేరెంట్స్ ఖాతాల్లోకి బదిలీ

By

Published : Feb 15, 2021, 8:15 PM IST

Updated : Feb 15, 2021, 9:12 PM IST

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల విషయంలో ఔరంగబాద్ బాటలోనే నడుస్తోంది లాతూర్ జిల్లా పరిషత్. ఉద్యోగుల జీతంలో 30 శాతం కోత విధించి.. వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది.

పిల్లలు తమను పట్టించుకోవడం లేదని 11 మంది తల్లిదండ్రులు అధికారులను ఆశ్రయించగా.. వారికి నగదు బదిలీ చేసింది లాతూర్ జిల్లా పరిషత్.

ఉద్యోగులకు తల్లిదండ్రుల పట్ల బాధ్యతను పెంచేలా లాతూర్ జిల్లా పరిషత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం పక్కాగా అమలయ్యేలా జడ్పీ ప్రెసిడెంట్ 'రాహుల్ కేంద్రే' స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లా పరిషత్ తొలిసారి ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా.. తల్లిదండ్రులపై అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత సిబ్బంది వేతనంలో 30శాతం కోత విధించాలని ప్రతిపాదించింది.

ఇదీ చదవండి:'కరోనాకు త్వరలో 19 టీకాలు!'

Last Updated : Feb 15, 2021, 9:12 PM IST

For All Latest Updates

TAGGED:

Mh_latur_02

ABOUT THE AUTHOR

...view details