తమ వద్ద స్వచ్ఛమైన బంగారు నాణేలు ఉన్నాయని చెప్పి నకిలీ బంగారు నాణేలు ఇచ్చి మోసం చేస్తున్న ఘటనలు కర్ణాటకలోని దావణగెరెలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి కేసులపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించినా.. మోసపోతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే కేరళకు చెందిన మురళీధర్ అనే వ్యక్తికి.. దావణగెరెలో నకిలీ బంగారు నాణేలు పేరిట రూ.30 లక్షలు టోకరా వేశాడు ఓ మోసగాడు.
అయితే అక్కడికి కొన్ని గంటల తర్వాత తాను మోసపోయానని గ్రహించిన మురళీధర్.. దావణగెరెలోని గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం సరిహద్దు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి నకిలీ బంగారు నాణేలు, రూ.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.