భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలిజీయం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి 9 మంది పేర్లను సిఫారసు చేసింది. వీరిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీతో పాటు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెల త్రివేది పేర్లను సుప్రీం కొలిజీయం సిఫారసు చేసింది. ఈ ముగ్గురిలో ఒకరు భారత తొలి మహిళా సీజేఐ కానున్నారు. జస్టిస్ నాగరత్నానికి ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2027లో ఆమె సీజేఐ కావచ్చు.
సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టిస్ చేస్తున్న తెలుగు న్యాయవాది పీఎస్ నరసింహ, జస్టిస్ ఏ ఓక, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఏకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవీంద్రకుమార్, జస్టిస్ ఎంఎం సురేంద్రన్.. కొలిజీయం సిఫారసు చేసిన మిగతా ఆరు పేర్లు.