భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఓ మహిళను అరెస్టు చేసేందుకు వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా పోలీసులు మరో విచిత్ర ఘటన గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. పోస్ట్ఉమన్ అయిన ఓ మహిళ.. మూడేళ్లుగా ఉత్తరాలను పంపిణీ చేయట్లేదని గుర్తించారు. ఆమె ఇంటి నుంచి మూడు బస్తాల ఉత్తరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వెయ్యికిపైగా ఆధార్ కార్డులు, రెండున్నర వేలకు పైగా స్పీడ్ పోస్ట్ లెటర్లు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు, ఎల్ఐసీ రశీదులు, చెక్కు బుక్కులు, విద్యార్థుల సర్టిఫికేట్లు ఉన్నాయి. వాటిలో చాలావరకు దెబ్బతిన్నాయి కూడా.
ఇదీ జరిగింది..
సర్కాఘాట్ మండలం నవాహిలో నివసిస్తున్న ఉషా దేవి పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ఉమెన్గా పనిచేస్తోంది. ఆమె భర్త గత వారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం తన భార్య, ఆమె ప్రేయసి, అత్తమామలేనని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మృతుడి సోదరుడు సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు.. సర్కాఘాట్ పోలీసులు ఉషాదేవితో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు.
విలువైన డాక్యుమెంట్లు..