కర్ణాటక గడగ్ జిల్లాలో దారుణం జరిగింది. మూడు నెలల పసికందుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (family feud commits suicide) ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులు ఊరి చివర ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో ఈ చర్యకు పాల్పడ్డారు.
నాగేంద్రగడ గ్రామంలో మల్లప్ప(30), ఆయన భార్య సుధా గడాడ్(24)తో కలిసి నివసిస్తున్నాడు. వీరిరువురు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల పాప (రూపశ్రీ) కూడా ఉంది. వీరందరూ ఊరి చివర ఉన్న తమ ఫామ్ హౌస్‌లో ఉరి వేసుకుని (family commits suicide together) మృతి చెందారు. మల్లప్ప హాల్లో ఉరి వేసుకోగా.. సుధ, కూతురు బెడ్రూమ్లో శవాలుగా కనిపించారు.