Pulwama Encounter news: జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. ద్రాబ్‌గామ్ ప్రాంతంలోని ముష్కరులు ఉన్నట్లు శనివారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.
"ఆయుధాలు, మందుగుండు సామగ్రి తదితర వస్తువలను స్వాధీనం చేసుకున్నాం. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయి. హతమార్చిన వారిలో ఒకరు జునైద్ షీర్గోజ్రీగా గుర్తించాం. మే 13న జవాన్ రియాజ్ అహ్మద్‌ను హతమార్చడంలో అతడి ప్రమేయం ఉంది" అని జమ్ముకశ్మీర్ ఐజీపీ తెలిపారు.
ఆ జవాన్ హత్యకు ప్రతీకారం- ముగ్గురు ఉగ్రవాదులు హతం - జమ్ము కశ్మీర్ అప్డేట్లు
Encounter In Kashmir: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.
Encounter In Kashmir