Kangaroos Rescued in Bengal: బంగాల్లోని జల్పాయ్గుడీ జిల్లా గజోల్దోబా ప్రాంతంలో శుక్రవారం రాత్రి మూడు గాయపడిన కంగారూలను గుర్తించారు అక్కడి అటవీశాఖ అధికారులు. బెలాకోబా అడవి పరిధిలోని ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా ఈ కంగారూలు కనిపించినట్లు రేంజర్ సంజయ్ దత్తా వెల్లడించారు. కంగారూలను చికిత్స నిమిత్తం బంగాల్ సఫారీ పార్క్‌కు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కంగారూల శరీరంపైన చాలా చోట్ల తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.
బంగాల్ అడవుల్లో ఆస్ట్రేలియా కంగారూలు.. తీవ్ర గాయాలతో నరకం.. స్మగ్లర్ల పనే!
Kangaroos Rescued in Bengal: బంగాల్లోని గజోల్దోబా ప్రాంతంలోని అడవిలో తీవ్రంగా గాయపడిన మూడు కంగారూలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతనెల కూడా అసోం నుంచి హైదరాబాద్‌కు కంగారూలను స్మగ్లింగ్ చేసేందుకు యత్నించగా వాటిని బంగాల్లో అధికారులు రక్షించారు.
మొదట రెండు కంగారూలను గుర్తించిన అధికారులు చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టగా మరొకటి కనిపించింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? ఈ ఘటనకు గల కారణాలేంటి మొదలైన వివరాలపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బంగాల్లో ఇలా కంగారూలను గుర్తించడం ఇది తొలిసారేం కాదు. గతనెల కూడా ఆస్ట్రేలియన్ కంగారూను అక్రమంగా తరలిస్తుండగా అలిపుర్దౌర్ జిల్లా పక్రిబారి ప్రాంతంలో పట్టుకున్నారు. ఈ కంగారూను అసోంలోని గువాహటి నుంచి తీసుకొచ్చారని, దానిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి :ఫుట్‌బాల్ ఆడిన బుజ్జి ఏనుగు.. వీడియో వైరల్