తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్ర చొరబాటు భగ్నం- ముగ్గురు ముష్కరులు హతం - baramulla news

జమ్ముకశ్మీర్​ హత్​లంగ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు(infiltration in kashmir) హతమయ్యారు. అనంతరం వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

jammu kashmir
జమ్ముకశ్మీర్

By

Published : Sep 23, 2021, 4:56 PM IST

Updated : Sep 23, 2021, 5:33 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల చొరబాటును(infiltration in kashmir) భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బరాముల్లా జిల్లా(Jammu Kashmir News) ఉరి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి భారత్​లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. అనంతరం వారి నుంచి భారీ మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.

"నియంత్రణ రేఖ వెంబడి హత్​లంగ ప్రాంతంలో ముష్కరులు చొరబాటుకు యత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపి ముగ్గురు ముష్కరులను హతమార్చాం." అని ఓ ఆర్మీ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి ఐదు ఏకే-47, ఎనిమిది తుపాకులు, 70 గ్రెనేడ్​లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఏకే-47 తుపాకులు స్వాధీనం
గ్రెనేడ్లు స్వాధీనం

ఈ మధ్యకాలంలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయని లెఫ్ట్​నెంట్ జనరల్ డీ పీ పాండే తెలిపారు. 'ఏడాది ప్రారంభం నుంచి ఉగ్ర చొరబాటు యత్నాలు తగ్గినప్పటికీ.. ఈ మధ్య లాంఛ్​ ప్యాడ్​ల వద్ద కార్యకలాపాలు పెరిగాయి. పాక్​ సైన్యం సాయం లేకుండా ఈ కార్యకలాపాలు జరిగే అవకాశం లేదు' అని పాండే అన్నారు.

ఇదీ చదవండి:

వీధి కుక్కలకు విషం పెట్టి హత్య.. 12 శునకాలు మృతి

Last Updated : Sep 23, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details