రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో విషాదం నెలకొంది. 80 అడుగుల లోతైన బావిలో బోరు వేసేందుకు దిగిన ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్కు గురై మరణించారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం..జిల్లాలోని రాయల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. జోధాదస్ గ్రామానికి చెందిన ధన్నా గుర్జర్.. తన పొలంలో ఉన్న బావిలో బోరు వేయాలనుకున్నాడు. అందుకోసం బోర్ వేసే వాళ్లను బుధవారం రప్పించాడు. పని మొదలుపెట్టేందుకు ముగ్గురు వ్యక్తులు బావిలోకి దిగారు. అనంతరం బోర్ వేయడానికి విద్యుత్ మీటర్ సిద్ధం చేశారు. దురదృష్టవశాత్తు నీటిలోకి విద్యుత్ ప్రవహించింది. దీంతో బావిలో ఉన్న ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
80 అడుగుల బావిలో దిగాక కరెంట్ షాక్.. అన్నదమ్ములతోపాటు మరొకరు అక్కడికక్కడే.. - 80 feet well current shock
80 అడుగుల బావిలో బోర్ వేసేందుకు దిగిన ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్ గురై మృతి చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లో జరిగింది. అసలు ఏమైందంటే?
3 including 2 brothers died due to electrocution in 80 feet deep well in rajasthan
సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం-ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా చేరుకుంది. సుమారు మూడుగంటలకు పైగా శ్రమించి బావిలోని ముగ్గురు మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు సోదరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.