ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. మూడు ఫ్యాక్టరీలపై దాడులు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
లోని ప్రాంతంలో.. 47 దేశీయ తుపాకులను, 43 రౌండ్ల లైవ్ బుల్లెట్లను.. తయరీలో ఉన్న మరికొన్ని విడిభాగాలను స్వాధీనం చేసుకున్నట్లు గాజియాబాద్ డీఐజీ అమిత్ పతక్ తెలిపారు. ఫ్యాక్టరీలపై మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వాహించామన్నారు. 18 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.