తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పబ్​జీ చిచ్చు.. స్నేహితుడిని కత్తితో పొడిచి చంపి... - పబ్​జీ మర్డర్

PUBG game murder: పబ్​జీ ఆటలో పడి కొందరు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఆన్​లైన్ గేమ్​కు బానిసలుగా మారి.. సొంత స్నేహితుడినే హతమార్చారు ముగ్గురు మిత్రులు. మరోవైపు, స్నేహితుడితో గొడవ పెట్టుకున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి తన సోదరుడిని కత్తితో పొడిచి చంపాడు.

game murder
మర్డర్

By

Published : Mar 1, 2022, 3:48 PM IST

PUBG game murder: పబ్​జీకి బానిసలుగా మారిన వారు ఎలా ప్రవర్తిస్తుంటారో కొన్ని సార్లు ఎవ్వరికి అర్థం కాదు. ఇప్పటికే ఈ ఆన్​లైన్ గేమ్ ఎందరినో బలితీసుకుంది. ఇప్పుడు మహారాష్ట్ర ఠాణెలోని వార్తక్ నగర్​లో మరో ఘటన జరిగింది. పబ్​జీ గేమ్ ఓ యువకుని ప్రాణం పోవడానికి కారణమైంది.

సాయిల్ జాదవ్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి తరచుగా పబ్​జీ ఆడేవాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ నలుగురు కలిసి పబ్​జీ ఆడుకున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య గొడవ తలెత్తింది. ముగ్గురు స్నేహితులు కలిసి సాయిల్ జాదవ్​పై దాడి చేశారు. కత్తితో పొడిచి చంపేశారు.

ఘటనాస్థలిలోనే జాదవ్ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు కారణమైన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు మైనర్ యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోదరుడినే మట్టుబెట్టి....

మరోవైపు, స్నేహితుడితో గొడవ పెట్టుకున్నాడని సోదరుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలోని చివాడ గల్లీలో ఈ ఘటన జరిగింది. నిందితుడు అశోక్​ని కల్​చౌకి పోలీసులు అదుపులోకి తీసుకుని మర్డర్ కేసు నమోదుచేశారు.

ఇదీ చదవండి:ఆస్పత్రిలో పేలుడు.. అనేక మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details