Three Friends Jumped In Canal: సాధారణంగా స్నేహితుల మధ్య కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సందర్భానుసారం వాటిని వారు నిరూపించుకుంటారు. కానీ హరియాణాకు చెందిన ముగ్గురు స్నేహితులు మాత్రం ఒకరిపై ఒకరికి ఉన్న స్నేహ బంధాన్ని నిరూపించుకునేందుకు ఒకేసారి నీటి కాలువలోకి దూకారు. వెంటనే గమనించిన స్థానికులు.. అమిత్ గుప్తను (24) రక్షించారు. మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ యోగేశ్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలువలో దూకడానికి ముందు ముగ్గురు యువకులు కలిసి మద్యం సేవించినట్లు ఆయన తెలిపారు. అనంతరం దుస్తులను తొలిగించి.. మొబైల్ ఫోన్ సహా పలు వస్తువులను కాలువ గట్టుపైనే పెట్టారని చెప్పారు. గల్లంతైన మోను(26), సంజీవ్(28) కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయని అన్నారు.