ఆటంకాలను అధిగమించి ఆ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇద ఎప్పుడూ మనం వినేదే అయినా ఈ పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. 3 అడుగుల వరుడు (3 feet groom in karnataka ), 2 అడుగుల వధువు (2 feet bride in karnataka )మెడలో తాళి కట్టాడు. కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లాలోని చింతామణి తాలూకాలో ఉన్న కైవార యోగి నారాయణ ఆలయంలో విష్ణు, జ్యోతి వివాహం జరిగింది. వేద మంత్రాల సాక్షిగా బంధు మిత్రుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు.
బెంగళూరుకు చెందిన విష్ణు, కోలార్‌కు చెందిన జ్యోతిలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. చాలా రోజులుగా వీరి కుటుంబ సభ్యులు అమ్మాయి-అబ్బాయి కోసం వెతుకుతున్నారు. అయితే వారు మరుగుజ్జులు కావడంతో అందరూ తిరస్కరించారు. చివరగా విష్ణు కుటుంబానికి, జ్యోతి కుటుంబానికి తెలిసిన ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఒకరినొకరు తెలుసుకున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఈ వివాహానికి పెద్దలు అంగీకారం తెలిపారు.