కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు(Farmers Protest News) త్వరలోనే ఉపసంహరణ కానున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) జోస్యం చెప్పారు. దిల్లీ సరిహద్దులోని గాజిపుర్లో(Ghazipur Border News) బారికేడ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టిన క్రమంలో ఆయన ట్వీట్ చేశారు.
" ఇప్పటివరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే మూడు సాగు చట్టాలు కూడా ఉపసంహరణ కానున్నాయి. అన్నదాతల సత్యాగ్రహం భేష్."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత