గత ఏడాది దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల (road accidents in India 2020) కారణంగా లక్షా 20 వేల మంది మరణించినట్లు జాతీయ నేర గణాంక సంస్థ (NCRB report 2020) వెల్లడించింది. నిర్లక్ష్యం కారణంగా రోజుకు సగటున 328 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్టు ఎన్సీఆర్బీ.. తన వార్షిక నివేదిక 'క్రైమ్ ఇండియా'లో (Crime India report) పేర్కొంది.
గడిచిన మూడేళ్లలో సుమారు 3 లక్షల 92 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు నివేదికలో (Crime India 2020) తెలిపింది. అలాగే 2018 నుంచి ఇప్పటివరకు లక్షా 35 వేల ఢీకొట్టి పారిపోయిన కేసులు (Hit and Run cases in India) నమోదైనట్లు వెల్లడించింది.
లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక అన్ని రకాల నేరాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ.. రోడ్డు ప్రమాదాల్లో (Lockdown road accidents) మాత్రం మార్పు రాలేదని నివేదికలో పేర్కొంది.