టైరు పేలి ముగ్గురు మృతి.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో టైరు పేలడం వల్ల ఎస్‌యూవీ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురు గాయపడ్డారు. శనివారం తప్‌కేశ్వర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, కారు పిచ్‌లోర్ నుంచి బాబుపూర్‌కు వస్తుందని నార్వార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనీష్ శర్మ తెలిపారు. "ముగ్గురు వ్యక్తులు మరణించారు. నలుగురు వ్యక్తులు ఆసుపత్రిలో ఉన్నారు. గాయపడిన నలుగురిలో ఒకరిని అత్యవసర చికిత్స కోసం గ్వాలియర్‌కు పంపాము" అని ఆయన చెప్పారు.
కారు టైరు పేలి ముగ్గురు మృతి.. జవాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు
టైరు పేలి ఎస్‌యూవీ కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురు క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మరోవైపు, గుజరాత్లో వాహన తనిఖీలు నిర్వర్తిస్తున్న ఓ జవానును ట్రక్కు ఢీకొనడం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు.
జవాను మృతి.. విధులు నిర్వర్తిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఢీకొనడం వల్ల గుజరాత్ గ్రామ రక్షక్ దళ్‌కు చెందిన ఓ జవాను మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మెహసానా పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న బాబు సోలంకి (42) నగరంలోని వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలోనే వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో జీఆర్డీ జవాను కూడా ఇదే విధంగా మరణించాడు.
ఇదీ చదవండి:రోగిని స్ట్రెచర్‌పై డాక్టర్ ఇంటికే తీసుకెళ్లిన బంధువులు