తెలంగాణ

telangana

ETV Bharat / bharat

25 ఏళ్ల క్రితమే 2డీజీ కొవిడ్​ ఔషధం! - డీఆర్​డీఈ 2డీజీ ఔషధం

డీఆర్​డీఓ రూపొందించిన 2డీజీ కొవిడ్​ ఔషధం 25 ఏళ్ల క్రితమే డీఆర్​డీఈ గ్వాలియర్​ రూపొందించిందని ఆ సంస్థ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్​ కరుణ శంకర్​ పాండే వెల్లడించారు. 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.

DRDE Gwalior, DRDE Made 2DG Oxy D Glucose In Gwalior
పాతికేళ్ల క్రితమే కొవిడ్​ ఔషధం!

By

Published : May 22, 2021, 2:02 PM IST

ఇటీవల డీఆర్​డీఓ రూపొందించిన 2డీజీ (2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్​) కొవిడ్​ ఔషధాన్ని డీఆర్​డీఈ గ్వాలీయర్​ 25 ఏళ్ల క్రితమే రూపొందించిందని ఆ సంస్థ మాజీ సీనియర్​ శాస్త్రవేత్త డాక్టర్​ కరుణ శంకర్​ పాండే వెల్లడించారు. ఈ 2డీజీ అణువును రూపొందించాలని నాటి డీఆర్​డీఓ డైరక్టర్​ ఏపీజే అబ్దుల్​ కలాం సూచించారని తెలిపారు. 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాకు దీటుగా..

"1995 కన్నా ముందు భారత్​.. ఐఎన్​ఎంఏఎస్​ (ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ న్యూక్లియర్​ మెడిసిన్​ అండ్​ అలాయిడ్​ సైన్సెస్​) ద్వారా అమెరికా నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునేది. అయితే దిగుమతి చేసుకోవడంలో సమస్యలు తలెత్తేవి. దీని పరిష్కారం గురించి ఆలోచిస్తున్న సమయంలో నాటి డీఆర్​డీఓ డైరక్టర్​ జనరల్​ ఏపీజే అబ్దుల్​ కలాం డీఆర్​డీఈ డైరక్టర్​ స్వామిని సంప్రదించి 2డీజీ కణాన్ని రూపొందించమని సూచించారు."

- డాక్టర్​ కరుణ శంకర్ పాండే, డీఆర్​డీఈ గ్వాలియర్​ మాజీ శాస్త్రవేత్త

అమెరికా ఆగ్రహం..

2డీజీ కణాన్ని తయారు చేయాలని కలాం సూచించిన సమయంలోనే బ్రెయిన్​ ట్యూమర్ల చికిత్సకు తగిన ఔషధాన్ని తయారు చేయమని ఐఎన్​ఎంఏఎస్​కు జర్మనీ ప్రాజెక్టును అప్పజెప్పిందని పాండే వెల్లడించారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా.. 1998 జనవరి 9న ఆ దేశంలోని 23 ల్యాబ్స్​పై నిషేధం విధించిందని తెలిపారు. దీంతో 2డీజీ కణాల అభివృద్ధి ప్రాజెక్టును ఐసీఎంఆర్​ అనుమతితో ప్రారంభించామని పాండే పేర్కొన్నారు.

పాండే నేతృత్వంలో..

2డీజీ కణాల అభివృద్ధి ప్రాజెక్టుకు డాక్టర్​ కరుణ శంకర్​ పాండే నేతృత్వం వహించారు. 1998 ఫిబ్రవరిలో పేటెంట్​ ప్రక్రియ ప్రారంభం కాగా.. 2002లో ఔషధానికి ఆమోదం లభించింది.

ఈ ప్రాజెక్టులో డాక్టర్​ పాండే సహా డాక్టర్​ శశినాథ్​ దూబే, డాక్టర్​ రామ్మూర్తి వేదనాథ్​ స్వామి, ఐఎన్​ఎంఏఎస్​కు చెందిన డాక్టర్​ రాకేశ్​ కుమార్​, డాక్టర్​ బీఎస్​ ద్వారకానాథ్​లు ఉన్నారు. ఈ ఔషధం క్యాన్సర్​ చికిత్సలో కూడా ప్రభావితం చేస్తుందని రుజువు అయింది.

ఇదీ చదవండి :బ్లాక్​ ఫంగస్ ముప్పు పురుషులకే అధికం!

ABOUT THE AUTHOR

...view details