కేరళలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. శనివారం కొత్తగా 29,682 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 142 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 21,422కు చేరింది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17.54గా ఉంది.
మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందంటే..
- మహారాష్ట్రలో తాజాగా 4,130 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 64మంది కరోనాతో మృతిచెందారు. కొత్తగా 2,506 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ముంబయిలో కొత్తగా 416 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా కొత్తగా నలుగురు మృతిచెందారు. తాజాగా 382 మంది కోలుకున్నారు.
- కర్ణాటకలో కొత్తగా 983మంది మహమ్మారి బారిన పడ్డారు. కొత్తగా 21మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి మరో 1,620 మంది కోలుకున్నారు.
- తమిళనాడులో కొత్తగా 1,575 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మహమ్మారితో మృతిచెందినవారి సంఖ్య 35వేలకు చేరింది. కొత్తగా 1,610 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మిజోరాంలో కొత్తగా 825 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందారు. శనివారం కొవిడ్ సోకిన వారిలో 203 మంది చిన్నారులే ఉన్నారు.
- ఒడిశాలో కొత్తగా 681కేసులు బయటపడ్డాయి. వారిలో 118 మంది చిన్నారులే ఉన్నారు. తాజాగా మరో ఐదుగురు మహమ్మారి కారణంగా మృతిచెందారు.
66.07 కోట్ల వ్యాక్సిన్ డోసులు..
ఇప్పటివరకు 66.07 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 4.49 కోట్ల డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఉన్నాయని తెలిపింది.
68 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు..