రాజస్థాన్ ఉదయ్‌పుర్ అంబమాత పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజ్ఞచక్షు అంధ విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. హాస్టల్లో 28 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అంధుల పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కరోనా నిర్ధరణ కాగా... విద్యార్థులు అందరికీ పరీక్షలు చేయించింది యాజమాన్యం.
అంధుల హాస్టల్లో 28 మంది పిల్లలకు కరోనా - కరోనా ఉదయ్‌పుర్
రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని అంధుల హాస్టల్లో 28 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఆ పాఠశాలలో ఇటీవల ఓ ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధరణ కాగా.. విద్యార్థులందరికీ పరీక్షలు చేయించింది యాజమాన్యం.
28 మంది అంధ విద్యార్థులకు కరోనా
సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ చేతన్ దేవరా, ఎస్పీ హాస్టల్‌కు వెళ్లారు. వైరస్ సోకిన విద్యార్థులను ఒక భవనంలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన విద్యార్థులను మరో చోటు ఉంచారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.
ఇదీ చదవండి :కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు