కర్ణాటకలోని కళాశాలల్లో కొవిడ్ కలకలం కొనసాగుతూనే ఉంది. బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థలో 60మంది విద్యార్థులకు(corona positive to students) బుధవారం కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా మాండ్య జిల్లాలో ఇంటర్ చదువుతున్న 28 మంది విద్యార్థినులు(students corona positive in karnataka) కరోనా బారిన పడ్డారు.
ప్రభుత్వ కళాశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా - విద్యార్థులకు కరోనా
మాండ్య జిల్లాలో ఇంటర్ చదువుతున్న 28 మంది విద్యార్థినులు(students corona positive in karnataka) కరోనా బారిన పడ్డారు. దీంతో వారం రోజుల పాటు కళాశాలలను అధికారులు మూసివేశారు.
మాండ్య జిల్లా నాగమంగళ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో 412 మంది విద్యార్థినులు ఉన్నారు. కరోనా అనుమానంతో వారిలో 372 మందిని పరీక్షలకు పంపగా.. మొదట 19 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను కూడా మరోసారి పరీక్షించారు. మరో 9 మందిలోనూ వైరస్ వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు కళాశాలలను అధికారులు మూసివేశారు. కరోనా సోకిన 28 మంది విద్యార్థినులను బీసీఎం హాస్టల్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు.
ఇదీ చదవండి:Corona cases in India: దేశంలో 23వేలు దాటిన కరోనా కేసులు