కలుషిత ఆహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటవ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని చింతగుప్పలో జరిగింది. ఈ జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
28 మంది జవాన్లకు అస్వస్థత- కారణం ఆ వంట నూనె!
కలుషిత ఆహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగింది. పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడమే అస్వస్థతకు కారణమని వైద్యులు తెలిపారు.
సీఆర్‌పీఎఫ్ జవాన్లు
పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడం వల్లే జవాన్లు అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై కమాండెంట్ రాజేశ్ యాదవ్ విచారణకు ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.