తెలంగాణ

telangana

కరోనా రెండో దశలో 270మంది వైద్యులు మృతి

కరోనా రెండో దశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 270 మంది వైద్యులు కొవిడ్​కు బలైనట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 748గా ఉన్నట్లు ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్​ వెల్లడించారు.

By

Published : May 18, 2021, 12:43 PM IST

Published : May 18, 2021, 12:43 PM IST

doctors died
రెండోదశలో కరోనాతో 270 మంది వైద్యులు మృత్యువాత

రెండో దశలో కరోనా ధాటికి ఇప్పటి వరకు 270 మంది డాక్టర్లు మరణించినట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) మంగళవారం వెల్లడించింది. చనిపోయిన వారి జాబితాలో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కేకే అగర్వాల్​ కూడా ఉన్నట్లు తెలిపింది.

ఎక్కువ మంది వైద్యులు బిహార్​లో(78) చనిపోయినట్లు పేర్కొంది. తరువాతి స్థానాల్లో ఉత్తర్​ప్రదేశ్ (37), దిల్లీ (29), ఆంధ్రప్రదేశ్​ (28)లు ఉన్నట్లు వివరించింది. ​

కొవిడ్​ మొదటి దశలో 748 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడినట్లు ఐఎంఏ తన గణాంకాల్లో పేర్కొంది.

"గతేడాది 748 మంది వైద్యులు కొవిడ్​తో కన్నుమూశారు. రెండో దశ ప్రారంభమైన అతి తక్కువకాలంలోనే 270 మంది చనిపోవడం చాలా బాధాకరం"

- డా. జేఏ జయలాల్, ఐఎంఏ అధ్యక్షుడు

కరోనా రెండో దశ చాలా తీవ్రంగా ఉందన్న జయలాల్​.. ఎక్కువ మంది వైద్యసిబ్బంది మృత్యువాత పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details