తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. 27 మందికి గాయాలు - Bridge collapses in JK

Bridge collapses: జమ్ముకశ్మీర్​లో వేర్వేరు ఘటనల్లో 43 మంది గాయపడ్డారు. సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. 27 మంది కార్మికులు గాయపడ్డారు. ఉధమ్​పుర్​ ​జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 16 మంది గాయపడ్డారు.

Bridge collapses in Jammu and Kashmir
Bridge collapses in Jammu and Kashmir

By

Published : Jan 3, 2022, 1:03 AM IST

Bridge collapses: జమ్ముకశ్మీర్​ సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. 27 మంది కార్మికులు గాయపడ్డారు. రెండు స్తంభాలను కలిపే ఇనుప షట్టరింగ్ కాంక్రిట్​ స్లాబ్​పై అమర్చతుండగా ఈ దర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

కూలిన వంతెన

తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రామ్‌గఢ్​-కౌల్‌పుర్ వద్ద దేవిక నదిపై సరిహద్దు రహదారి సంస్థ ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

తిరిగి ప్రయాణంలో ప్రమాదంలో

జమ్ముకశ్మీర్​ ఉధమ్​పుర్​ జిల్లాలో మినీ బస్సు-ఆయిల్ ట్యాంకర్​ను ఢీకుంది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు.​ క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా దిల్లీకి చెందినవారిగా అధికారులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details