మ్యూకర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న 27 మందికి.. వైద్యులు ఇంజెక్షన్ అందించగా వారి శరీరాల్లో ప్రతికూల మార్పులు కనిపించాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ వైద్య కళాశాలలో జరిగింది. దాంతో వెంటనే.. మిగతా రోగులకు ఈ ఇంజెక్షన్‌ను అందించటాన్ని వైద్యులు నిలిపివేశారు.
బుందేల్‌ఖండ్ వైద్య కళాశాలలోని మ్యూకర్మైకోసిస్ వార్డులో చికిత్స పొందుతున్న 27 మందికి బ్లాక్ ఫంగస్ నివారణలో ఉపయోగించే 'ఆంఫోటెరిసిన్ బి' ఇంజెక్షన్‌ను వేసినట్లు వైద్యులు తెలిపారు. ఇంజెక్షన్ ప్రతికూల ప్రభావాన్ని చూపగా అప్రమత్తమై... వెంటనే వారికి చికిత్స అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు.