తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం తొలిదశ ఎన్నికల బరిలో 267 మంది

అసోంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో 267 మంది పోటీ చేయనున్నారు. 47 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో అసోం సీఎం సర్భానంద సోనోవాల్​, స్పీకర్​ హితేంద్ర నాథ్​ గోస్వామి సహా ఇతర మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ ఎన్నికల కోసం 408 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ​

267 candidates in fray in 1st phase of assembly polls of assam
అసోం తొలిదశ ఎన్నికల బరిలో 267 మంది

By

Published : Mar 14, 2021, 9:51 AM IST

అసోంలో 47 స్థానాలకుగాను జరగనున్న మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 267 మంది అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. కాగా 39 స్థానాలకు జరగనున్న రెండో దశ ఎన్నికల కోసం 408 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అసోం ఎన్నికల ప్రధాన అధికారి రాహుల్​ దాస్​ తెలిపారు.

అసోం మొదటి దశ ఎన్నికల కోసం మొత్తం 295 నామినేషన్లు రాగా.. 10 మంది అభ్యర్థనలను తిరస్కరించినట్లు రాహుల్​ దాస్​ తెలిపారు. మరో 18 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని చెప్పారు.

తొలిదశ పోరులో ప్రముఖులు వీరే..

మొదటి దశ ఎన్నికల్లో భాజపా తరఫున మజులీ నుంచి అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్, జోహ్రత్​ నుంచి స్పీకర్​ హితేంద్ర నాథ్​ గోస్వామి, మంత్రులు రంజిత్​ దుత్తా, నబా కుమార్​ దోలే, సంజయ్​ కిషన్​ పోటీ చేయనున్నారు. అసోం కాంగ్రెస్​ అధ్యక్షుడు రిపున్​ బోరా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భరత్​ నాథ్​ సహా తదితర ముఖ్యనేతలు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

ABOUT THE AUTHOR

...view details