తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యర్థాలతో ఎఫ్​1 రేసింగ్​ కార్.. 26 ఏళ్ల యువకుడి ప్రతిభ

Car Made of Scrap: కారు తయారు చేయాలనే సంకల్పంతో ఓ యువకుడు ఏకంగా స్పోర్ట్స్​ కారునే రూపొందించాడు. కారు, బైక్​ వ్యర్థాలతో ఫార్ములా వన్​ రేసింగ్​కు తగినట్లుగా వాహనాన్ని తయారుచేసి రోడ్ల మీద పరుగులు పెట్టిస్తున్నాడు. 26 ఏళ్ల ఆ యువకుడి ప్రయత్నం చూసి ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది.

Car Made of Scrap
ఎఫ్​1 రేసింగ్​ కారు

By

Published : Jan 29, 2022, 5:14 PM IST

Updated : Jan 29, 2022, 7:31 PM IST

వాహనాల వ్యర్థాలతో రేసింగ్​ కారు తయారు చేసిన యువకుడు

Car Made of Scrap: తనకుంటూ సొంతకారు ఉండాలని ఈ యువకుడు కలలు కనేవాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల కొన్నేళ్ల క్రితం తానే సొంతంగా వ్యర్థాలను సేకరించి కారు తయారు చేసుకోవడం ప్రారంభించాడు. అపజయాలు ఎదురవుతున్నా పట్టువదలకుండా కృషి చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 26 ఏళ్ల ఈ యువకుడి పేరు స్వప్నిల్​ కాశీనాథ్​ చోప్కర్.

రేసింగ్​ కారుతో రూపకర్త స్వప్నిల్​
వాహనాల వ్యర్థాలతో రూపొందించిన రేసింగ్​ కారు

మహారాష్ట్ర నాగ్​పుర్​లోని పార్వతీ నగర్​కు చెందిన స్వప్నిల్​.. కారు, ద్విచక్రవాహనాల వ్యర్థాలతో వాహనం తయారు చేశాడు. ఇది సాధరణ కారు కాదు. ఫార్ములా వన్​ రేసింగ్​కు తగినట్లు రూపొందించిన స్పోర్ట్స్​ కార్. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే వచ్చిన సంపాదనతో ఈ కారును తయారు చేశాడు స్వప్నిల్​. 800 సీసీ ఇంజిన్​తో రూపొందించిన ఈ కారు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజ్​ ఇచ్చే ఈ కారును భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తానంటున్నాడు స్వప్నిల్​. ఈ కారు తయారీకి దాదాపు రూ.15 లక్షలు ఖర్చు అయిందని చెప్పుకొచ్చాడు.

ఎఫ్​1 రేసింగ్​ కారులో స్వప్నిల్
ఎఫ్​1 రేస్​ కారు
Last Updated : Jan 29, 2022, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details