Odisha Tomato flu: ఒడిశాలో టమాట ఫ్లూ కలకలం రేపింది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్(HFMD)గా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది. సాధారణంగా దీన్ని టమాట ఫ్లూ అంటారు. పేగు సంబంధిత వైరస్ కారణంగా ఈ అంటు వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా చిన్నారులకు ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు ఈ వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు.
Tomato flu symptoms: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. మొత్తం 36 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్‌లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.