బంగాల్ ఏడో విడత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 26 శాతం మందికి నేరచరిత్ర ఉన్నట్లు 'అసోసియేషన్‌ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)' స్పష్టం చేసింది. వీరిలో 18 మంది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో అరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ముగ్గురిపై హత్యాచార కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. బరిలో నిలిచిన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది.
ఈ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 284 మందిలో 73 అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు ఉండగా.. సుమారు 60 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్, భాజపా, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్లో ప్రతీ పార్టీ నుంచి 19 అభ్యర్థులపై వివిధ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ఏడీఆర్ ప్రకటించింది.