తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర ఎన్​కౌంటర్​లో​ 26 మంది నక్సల్స్ మృతి

encounter
ఎన్​కౌంటర్

By

Published : Nov 13, 2021, 7:27 PM IST

Updated : Nov 13, 2021, 9:25 PM IST

19:25 November 13

మహారాష్ట్ర ఎన్​కౌంటర్​లో​ 26 మంది నక్సల్స్ మృతి

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఉండే ఓ గ్రామాల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం పోలీసులకు అందింది.  దీంతో ఈ ఉదయం చుట్టుపక్కల గ్రామాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఈ సమాచారాన్ని అందుకున్న జిల్లా అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి హెలికాప్టర్​లను పంపడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా జల్లెడ పట్టారు. అంతేగాకుండా సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. అనంతరం ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. 

మృతుల్లో కీలక నేత?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్‌ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మావోయిస్టు నేత మిలింద్‌ తెల్‌తుంబ్డే కూడా ఈ కాల్పుల్లో మరణించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఎల్గార్ పరిషత్-భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పుణే పోలీసులు.. తెల్‌తుంబ్డేను వాంటెడ్ నిందితుల జాబితాలో చేర్చారు.

ఇన్‌ఫార్మర్లనే అనుమానంతో..

మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్థులను కాల్చి చంపారు. బాధితులు పోలీస్ ఇన్‌ఫార్మర్లనే అనుమానంతోనే మావోయిస్టులు వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. బైహర్ పోలీస్​స్టేషన్​పరిధిలోని మాలిఖేడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతులను సంతోశ్‌​(40), జగదీష్​ యాదవ్​గా (45) గుర్తించారు. గ్రామస్థులు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఘటనా స్థలంలో మావోయిస్టులు కరపత్రాలు వదిలివెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Last Updated : Nov 13, 2021, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details