తెలంగాణ

telangana

రెసిడెన్షియల్‌ పాఠశాలలో 26 మంది విద్యార్థినులకు కరోనా

By

Published : Nov 27, 2021, 3:45 PM IST

corona student news: విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఒడిశా రాయ్​రంగ్​పుర్​ జిల్లాకు చెందిన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలోని 26 మంది వైరస్ బారిన పడ్డారు. అంతకుముందు కర్ణాటకలోనూ రెండు ఘటనల్లో మొత్తం 300 పైగా విద్యార్థులకు కరోనా సోకింది.

coronavirus to students
కరోనా సోకిన విద్యార్థులు

corona student news: ఒడిశా రాయ్‌రంగ్‌పుర్‌ జిల్లాలో 26మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. మయూర్‌భంజ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 259 విద్యార్థులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్దఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

పాఠశాలలో విద్యార్థినులకు కరోనా

పాఠశాల వద్ద అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితే తలెత్తితే వెంటనే బాధితులను తరలించేందుకు అంబులెన్స్‌ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. పాఠశాలకు వస్తున్న బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు గమనించారు. బాధిత విద్యార్థులకు గత గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా 26మందికి కొవిడ్‌ నిర్ధరణ అయినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ పాఠశాల ప్రాంగణంలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థులకు అందుబాటులో ఉంచిన ఆంబులెన్స్​ సేవలు

కర్ణాటకలో..

కర్ణాటక ధార్వాడ్​లోని ఎస్​డీఎమ్ వైద్య కళాశాలలోనూ కొవిడ్​-19 కలకలం సృష్టించింది. ఇప్పటివరకు వైరస్​ బారిన పడిన విద్యార్థుల సంఖ్య 281కు చేరినట్లు ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీశ్​ పాటిల్ తెలిపారు. కొత్తగా 99 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. ఇంకా 1,822 శాంపిల్స్​ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కరోనా నిర్ధరణ అయిన 281 మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్​ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారేనని వివరించారు. విద్యార్థులందరినీ క్వారంటైన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.

ఫ్రెషర్స్​ పార్టీతోనే..

కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్​ కె. పాటిల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. విద్యార్థుల శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్​సింగ్ కోసం పంపించారు. ఇప్పటికే క్యాంపస్​లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేశారు అధికారులు.

బెంగళూరులోనూ..

కర్ణాటక, ధార్వాడ్​లోని వైద్య కళాశాలలో 182 మందికి వైరస్​ సోకిన సంఘటన వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే.. అదే రాష్ట్రంలోని ఓ పాఠశాలలో భారీగా కేసులు బయటపడ్డాయి. బెంగళూరు అర్బన్​​ జిల్లా, అనెకల్​ తాలుకలోని దొమ్మసంద్రలోని బోర్డింగ్​ పాఠశాలలో 33 మంది విద్యార్థులు సహా ఓ ఉపాధ్యాయుడికి కొవిడ్​-19 వైరస్​ పాజిటివ్​గా(Covid-19 latest news) తేలింది.

కొంప ముంచిన ఫ్రెషర్స్​ పార్టీ...

వైద్య కళాశాలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్​ కె. పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారని వివరించారు. గురువారం మొత్తం 300 మందికి పైగా వైద్యపరీక్షలు నిర్వహించగా.. 66 మంది వైరస్ బారిన(Covid-19 karnataka) పడ్డారన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 182కు చేరినట్లు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన వారిని క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొంతమంది విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్​సింగ్ కోసం పంపిస్తామన్నారు. ఇప్పటికే క్యాంపస్​లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Corona cases in India : దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

ఆరోగ్యాన్ని రక్షించే ఆయుర్వేదిక్​ సిగరెట్​కు పేటెంట్​

ABOUT THE AUTHOR

...view details