అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లో కొవిడ్ కారణంగా ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. వీరిలో 26 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేవలం20 రోజుల వ్యవధిలో వీరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఏఎంయూ ఉపకులపతి తారిక్ మన్సూర్ విజ్ఞప్తి మేరకు అధికారులు వైరస్ నమూనాలను సేకరించి పరీక్షల కోసం దిల్లీకి పంపించారు. కొత్త వేరియంటే మరణాలకు కారణమని అధికారులు భావిస్తున్నారు.