మధ్యప్రదేశ్ ఇందోర్ మహారాజా యశ్వంత్రో ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్(black fungus)తో చేరిన రోగుల్లో 25-30శాతం మందికి ఇంతవరకు కరోనా సోకిన ఆనవాళ్లే లేవు. ఈ విషయాన్ని ఆసుపత్రితో అనుసంధానమైన మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ వెల్లడించారు. కరోనా సోకిన వారికే బ్లాక్ ఫంగస్ ముప్పు ఉందని ఇంతకాలం భావించిన తరుణంలో.. డీన్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించారు సంజయ్ దీక్షిత్. ఆయా రోగుల్లో ఇదివరకు కరోనా(corona virus) సోకినా.. పరీక్ష చేయించుకోలేదేమోనని.. వ్యాధి నుంచి వారికి తెలియకుండానే కోలుకుని ఉంటారని సంజయ్ అన్నారు. కరోనా సోకకుండా బ్లాక్ ఫంగస్ బారిన పడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.