కర్ణాటకలో భారీస్థాయిలో నిషేధిత పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యాద్గిరి జిల్లా సూరంపుర తాలుకాలోని ఓ గనిలో వీటిని పట్టుకున్నారు.
మొత్తం 25 కిలోల బరువు ఉన్న 30 జిలెటిన్ స్టిక్స్‌ను 'ఆరాధ్య స్టోన్ క్రిస్టియన్ క్వారీ'లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత భద్రతా విభాగానికి చెందిన పోలీసు అధికారి నేతృత్వంలోని బృందం నిర్వహించిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి.
జిలెటిన్ స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు క్వారీలో అధికారుల తనిఖీలు డబ్బాలో భద్రపరిచిన పేలుడు పదార్థాలు క్వారీని ఎస్పీ రిషికేశ్ భగవాన్ సోనావనే సందర్శించారు. క్వారీ మేనేజర్ ఆనంద రెడ్డి సహా ఓ బొలేరో వాహన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్వారీ.. ముద్దెబిహల్ ఎమ్మెల్యే ఎస్ఎస్ పాటిల్ సోదరుడికి చెందినదిగా తెలుస్తోంది.
ఇదీ చూడండి:పుస్తకాలు చదివి సేద్యం.. రోజుకు రూ.1500 సంపాదన!