ప్రపంచ ఖడ్గమృగాల సంరక్షణ దినం(world rhino day 2021) సందర్భంగా.. అసోం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖడ్గమృగాల కొమ్ముల దహనం(rhino horn burning) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Assam cm) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1979 నుంచి ఇప్పటివరకు వివిధ సంఘటనల్లో స్వాధీనం చేసుకున్న 2,479 కొమ్ములను గోలాఘాట్ జిల్లాలోని కాజీరంగ నేషనల్ పార్క్ సమీపంలో బొకాఖట్ కవాతు మైదానంలో బహిరంగంగా దహనం చేశారు. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలున్నాయన్న అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట్ర సర్కారు పేర్కొంది.
World Rhino Day: భారీ సంఖ్యలో ఖడ్గమృగాల కొమ్ముల దహనం
అసోం ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఖడ్గమృగాల కొమ్ముల దహనం జరిగింది. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలున్నాయన్న అపోహలను ప్రజల్లో తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం (world rhino day 2021) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఖడ్గమృగాల కొమ్ముల దహనం
ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు(Rhino horn really work) ప్రపంచంలో అత్యధికంగా అసోంలోనే ఉన్నాయి. చైనా దేశస్థులు సంప్రదాయ వైద్యం మందుల తయారీలో దీనిని వినియోగిస్తారు. వియత్నాంలో ఈ కొమ్మును కలిగి ఉండటం ఒక హోదాగా భావిస్తారు. ఈ దేశాల్లో ఉన్న గిరాకీ వల్ల ఖడ్గమృగాల వేట సాధారణమైపోయింది.
ఇదీ చూడండి:దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
Last Updated : Sep 22, 2021, 2:41 PM IST